Home జాతీయం ఆధునిక చాణక్యుడు అమిత్ షా

ఆధునిక చాణక్యుడు అమిత్ షా

231
0
  • వికాస్ రుషి

అమిత్ షా.. ఈ పేరు విన‌ని వారు ఇప్పుడు క‌న్పించరు. రాజ‌కీయ మిత్రులు, విరోధులు కూడా ఆయ‌న పేరే స్మ‌రించాల్సిన ప‌రిస్థితి ఇప్పుడు నెల‌కొంది. 2014 ఎన్నిక‌లు పూర్తిగా మోదీ చుట్టే తిరిగితే.. 2019 ఎన్నిక‌ల్లో మోదీతో పాటు అమిత్ షా చుట్టూ తిరిగాయి. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా షా రూపొందించిన ప్ర‌ణాళికతో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించింది. ఇప్పుడాయ‌న‌ను అంద‌రూ ఆధునిక చాణ‌క్యుడిగా అభివ‌ర్ణిస్తున్నారు.
55 ఏళ్ల షా
అమిత్ షా 22 అక్టోబ‌ర్ 1964లో జ‌న్మించారు. ముంబాయి నుంచి వ‌ల‌స వ‌చ్చిన సంప‌న్న వైశ్య‌ కుటుంబంలో జ‌న్మించిన ఆయ‌న సంప్ర‌దాయ విద్య అభ్యసించారు. బీజేపీ (జ‌న‌సంఘ్)లో సాధార‌ణ కార్య‌క‌ర్త‌గా చేరిన ఆయ‌న నిరంత‌ర కృషితో గుజ‌రాత్‌లో కీల‌క నేత‌గా ఎదిగారు. న‌రేంద్ర‌మోదీ సార‌ధ్యంలోని బీజేపీ ప్ర‌భుత్వంలో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను ఎన్‌కౌంట‌ర్లలో హ‌త్య చేయించార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత షా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

ఆధునిక చాణ‌క్యుడు షా

2019 ఘ‌న విజ‌యంతో అమిత్ షాను ఆధునిక చాణుక్యుడిగా అభివ‌ర్ణిస్తున్నారు. పార్టీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత చాణ‌క్య నీతిని అమ‌లు చేశారు. చాణ‌క్యుడు చెప్పినట్టుగా తాము బ‌లం పెంచుకోవ‌డంతో పాటు ప్ర‌త్య‌ర్థుల‌ను నిరంత‌రం గ‌మ‌నించారు. వాటి బ‌లం, బ‌ల‌హీన‌త‌లు పూర్తిగా తెలుసుకున్నారు. త‌ద్వారా వాటి బ‌లాన్ని త‌గ్గించే విధంగా ప్ర‌ణాళిక అమ‌లు చేశారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్షాలు ఏకంకాకుండా ప్ర‌ణాళిక అమ‌లు చేశారు. రాజ‌కీయ పార్టీ అనేది ఎన్నిక‌ల స‌మ‌యంలోనే వ‌చ్చేదీ కాదు.. నిరంతరం జ‌నంలోనే ఉంటామ‌న్న సంకేతాన్ని బ‌లంగా పంపించారు. నిర్దేశించుకున్న‌ ల‌క్ష్యాన్ని చేరుకుంటామ‌ని, తాము 300 సీట్ల‌కు పైగా సాధిస్తామ‌ని స్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు. ఎక్క‌డిక‌క్క‌డ త‌న‌ను తాను ఎక్కువ చేసుకోకుండా.. ప్ర‌ధానిగా మ‌ళ్లీ మోదీనే అంటూ విస్త్రుతంగా ప్ర‌చారం నిర్వ‌హించారు. ఆయ‌న ఫేస్‌బుక్ పేజీ చూస్తే మోదీని ఎంత‌గా ఇష్ట‌ప‌డ‌తారో తెలుస్తుంది.
2014లో పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా షా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.
ఆ త‌ర్వాత పార్టీని పూర్తి స్థాయిలో బ‌లోపేతం చేశారు.
20 రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌చ్చింది.
11 కోట్ల మంది స‌భ్య‌త్వంతో ప్ర‌పంచంలో అత్య‌ధిక స‌భ్య‌త్వం క‌లిగిన పెద్ద‌ పార్టీగా నిర్మించారు.
2017 నుంచే పార్టీని ఎన్నిక‌ల దిశ‌గా న‌డ్పించారు.
ప‌టిష్ట‌మైన ప్ర‌ణాళిక రూపొందించారు.
ఆరు నెల‌ల ముందే వివిధ పార్టీల‌తో పొత్తులు కుదుర్చుకున్నారు.
రాహుల్‌గాంధీని బ‌ల‌హీన‌మైన నాయ‌కుడిగా ప్ర‌చారం చేయ‌డంలో విజ‌యం సాధించారు.
ప్ర‌తిప‌క్షాల‌ను బ‌ల‌హీనం చేశారు.
వాటిని ఏకం కాకుండా చూసి దేశ‌వ్యాప్తంగా మ‌హాకూట‌మి ఏర్పాటు కాకుండా చేశారు.
ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాన్ని మార్చి మార్చి అమ‌లు చేశారు.
ఏ రాష్ట్రానికా రాష్ట్రం అన్న‌ట్టుగా ప్ర‌చారంలో మార్పులు.
ప‌శ్చిమ‌బెంగాల్ వంటి రాష్ట్రంలో అసాధ‌ర‌ణ రీతిలో సీట్లు సాధించారు.
తీవ్రంగా న‌ష్ట‌పోతార‌ని భావించిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో.. అతి త‌క్కువ న‌ష్టంతో బ‌య‌ట‌ప‌డ్డారు.
నిర్దేశించుకున్న ల‌క్ష్యాన్ని అధిగ‌మించారు.
మోదీని ప్ర‌ధాన‌మంత్రిగా చేశారు.

2024 ప్ర‌ధాన‌మంత్రా..?

కేంద్ర కేబినెట్ ఏర్ప‌డిన త‌రువాత ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ కంటే.. కూడా అమిత్ షా పేరు ఎక్కువగా విన‌ప‌డుతోంది. ప్ర‌తిప‌క్షాలు కూడా ఆయ‌న పేరునే ప్ర‌స్తావిస్తున్నాయి. పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా ఉన్న షాను కేంద్ర కేబినెట్‌లో తీసుకోవ‌డంతో పాటు కీల‌క‌మైన హోంమంత్రి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీంతో.. ప్ర‌తిప‌క్షాలు షాను ల‌క్ష్యంగా చేసు కున్నాయి. గుజ‌రాత్‌లో ఎన్‌కౌంట‌ర్లు చేసిన వ్య‌క్తికి హోంశాఖ‌ను ఎలా ఇస్తారంటూ ప్ర‌శ్నిస్తున్నాయి. షాను హోంమంత్రిగా చేయ‌డంతో కశ్మీర్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ప‌నిలో ప‌నిగా 2024 ఎన్నిక‌ల్లో షా ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి అభ్య‌ర్థిగా ఎంపిక చేస్తార‌న్న‌ ప్ర‌చారం కూడా సాగుతోంది. కార్య‌క‌ర్త‌ స్థాయి నుంచి జాతీయ అధ్య‌క్షుడిగా ఎదిగిన షా.. ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి అధిష్టించ‌లేడా..? ఏం జ‌రుగుతుందో వేచి చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here