Home breaking news ఆడ‌పులిలో ఓట‌మి భ‌యం- క‌ల‌సిర‌మ్మ‌ని ఆర్ధ‌త‌తో కూడిన పిలుపు

ఆడ‌పులిలో ఓట‌మి భ‌యం- క‌ల‌సిర‌మ్మ‌ని ఆర్ధ‌త‌తో కూడిన పిలుపు

217
0

ఆడపులికి ఓట‌మి భ‌యం వెన్నాడుతోంది. అంద‌రం క‌లిసి క‌ట్టుగా ఉందాం.. త‌న‌తో క‌లిసి ర‌మ్మ‌ని బేలగా ఆర్ధిస్తోంది. అయితే ఆ ఆడ‌పులి చేసిన విన్న‌పానికి తిర‌స్కృతే ఎదురైంది. మేము ర‌మ్మ‌న్న‌ప్పుడు రాలేదు కానీ.. ఇప్పుడు నీక‌వ‌స‌రమ‌ని ర‌మ్మంటావా..? అన్న‌ట్టుగా ఓ చూపు.. ఇంతకీ ఆడ‌పులి..ఏమిటీ ఏమిటా క‌త అనుకుంటున్నారా..? చ‌ద‌వండి

ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌క ముందు.. పశ్చిమ‌బెంగాల్‌ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని మాజీఎంపీ, న‌టుడు శ‌తృఘ్న‌సిన్హా ఆడ‌పులితో పోల్చారు. ఆమె తెరువు పోవ‌ద్దు సుమా..? అని బీజేపీని హెచ్చ‌రించారు. శ‌తృ చెప్పిన ఆడ‌పులి ఎన్నిక‌ల ముందు.. భీక‌రంగా గ‌ర్జించింది. క‌లిసిపోదామ‌ని కాంగ్రెస్ నుంచి సంకేతాలు వ‌స్తే.. చీత్క‌రించింది. రాహుల్ ప్ర‌ధానమంత్రి ప‌ద‌వికి అర్హుడే కాద‌ని దెప్పిపొడిచింది. ఆ ప‌ద‌వికి అర్హ‌త నాకు త‌ప్ప ఎవ‌రికీ లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించింది. త‌న దెబ్బ‌కు కుదేలైన కాంగ్రెస్‌, సీపీఎం అంటే ఆమె చుల‌క‌నగా చూశారు. బీజేపీని అదే విధంగా చూశారు. నన్ను ఢీకొట్టేంత సీన్ బీజేపీకి లేద‌ని విశ్వ‌సించారు. అణ‌గదొక్కుదామ‌ని చూస్తే బీజేపీ ఎదురుతిరిగి.. ప్ర‌తి జవాభిచ్చింది. బీజేపీ చూపించిన ఆ తెగువే.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో లాభాన్ని చేకూర్చింది. మ‌మ‌త‌కు ధీటుగా సీట్లు సాధించింది. అప్పుడు మొద‌లైంది.. ఆడ‌పులి దీదీకి లోలోప‌ల‌ భ‌యం.

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు చుక్క‌లు చూపించారు. వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు.. ఏం జ‌ర‌గ‌బోతోంద‌న్న భ‌యం మొద‌లైంది. త‌న‌కూ ఓ తోడు కావాలి అన‌కున్న‌ది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో క‌న్పించ‌ని కాంగ్రెస్ అప్పుడు క‌న్పించింది.. క‌లిసి పోదాం ర‌మ్మ‌ని ఆర్ధ‌తగా పిలిచింది. సీపీఎంను ర‌మ్మ‌ని కోరింది. కానీ.. ఆమెలో భ‌యం మొద‌లైన సంగ‌తిని ఆ రెండు పార్టీలు గుర్తించాయి. పైగా మ‌మ‌త వ్య‌వ‌హారం తెలిసిన ఆ రెండు పార్టీలు సానుకూలంగా స్పందించ‌లేదు. ఆనాడు నువ్వు మాపై ప్ర‌ద‌ర్శించిన దూకుడే.. ఈనాడు బీజేపీ నీపై ప్ర‌యోగిస్తోంది. మీరిద్ద‌రూ ఏమైనా చేసుకోండ్రి. మ‌ధ్య‌లో మేము రామ‌న్న‌ట్టుగా సంకేతాలిచ్చి దూరంగా జ‌రిగాయి. అప్ప‌టిలాగానే.. ఇప్పుడు కూడా మ‌మ‌త ఒంట‌రే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here