Home breaking news ఆక్రమిత కశ్మీర్ పైనే దృష్టి – పాకిస్థాన్​కు షాకిచ్చిన భారత్

ఆక్రమిత కశ్మీర్ పైనే దృష్టి – పాకిస్థాన్​కు షాకిచ్చిన భారత్

416
0
ఫొటో: గూగుల్​ నుంచి

ఆర్టికల్​ 370 రద్దుతో అంతర్జాతీయ సమాజం ఎదుట గగ్గోలు పెడుతున్న పాకిస్థాన్​కు భారత్​ మరో షాక్​ ఇచ్చింది. పాకిస్థాన్​తో చర్చలు జరపడమంటే.. అది ఒక్క ఆక్రమిత కశ్మీర్​పైన మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. అది కూడా ఉగ్రవాదానికి ఆశ్రయం ఇవ్వకుంటేనే చర్చలు ఉంటాయని ప్రకటించింది. హర్యానాలో ఆదివారం జరిగిన జనాశీర్వాద్​ ర్యాలీని ఉద్దేశించి రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​ ఈ మేరకు మాట్లాడారు. జమ్మూ కశ్మీర్​ అభివృద్ధికి ఆటంకంగా మారిన ఆర్టికల్​ 370ని రద్దు చేయడానికి నిమిషాల మీద నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. దేశ రక్షణ, అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయమంటూ స్పష్టం చేశారు. మా​లో అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్​పై నిర్ణయం తీసుకుంటే.. అంతర్జాతీయ సమాజం ఎదుట రాద్ధాంతం చేయాల్సిన అవసరమేంటని పాక్​పై విమర్శలు గుప్పించారు. ఇప్పటి నంచి ఆ దేశంతో చర్చలు కేవలం ఆక్రమిత కశ్మీర్​పైనే ఉంటుందని.. అది కూడా ఉగ్రవాదానికి ఆశ్రయం ఇవ్వకుంటేనే అని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here