Home ఎడ్యుకేషనల్/జాబ్స్ ఆంధ్రప్రదేశ్​లో 7966 లైన్​మెన్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్​లో 7966 లైన్​మెన్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

265
0
ఆంధ్రప్రదేశ్లో 7966 లైన్పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ - చివరి తేదీ 17

ఆంధ్రప్రదేశ్​లో జూనియర్​ లైన్​మన్​ పోస్లుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. ఈ పోస్టులను ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో 7,966 మంది లైన్​మెన్ల పోస్టులను భర్తీ చేస్తారు. ఈ మేరకు ఏపీఈపీడీసీఎల్​, ఎస్పీడీసీఎల్​ విడివిడిగా నోటిఫికేషన్లను విడుదల చేశాయి. ఆగస్టు 17లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గ్రామ సచివాలయాల్లో 2,177 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 682 పోస్టులున్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో గ్రామ సచివాలయాల్లో 3,866 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 1,241 పోస్టులున్నాయి. రిజర్వేషన్లు, ఇతర వివరాలను ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.  ఆన్​లైన్​లోనే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హతలు:

ఈ ఏడాది జులై 1నాటికి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న పురుష అభ్యర్థులు అర్హులు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపు.

ఐటీఐ ఎలక్ట్రికల్, వైర్‌మేన్ ట్రేడ్ కోర్సుతో పాటు పదో తరగతి చదవివి ఉండాలి.

ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులో ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయెన్సస్ అండ్ రివైండింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ చేసిన వారు అర్హులే.

https://www.apeasternpower.com/http://gramasachivalayam.ap.gov.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here