Home breaking news అస‌మ‌ర్ధ నేత‌ – చంద్ర‌బాబుపై మోదీ ఫైర్‌

అస‌మ‌ర్ధ నేత‌ – చంద్ర‌బాబుపై మోదీ ఫైర్‌

75
0

ఏపీ నేత‌లు త‌మ అస‌మ‌ర్థ‌త‌ను కప్పిపుచ్చుకోవ‌డానికి నాపై ఆరోప‌ణ‌లు చే స్తున్నార‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ విమ‌ర్శించారు. విశాఖ‌లో శుక్ర‌వారం ప‌ర్య‌టించిన ఆయ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఉద్దేశించి విమ‌ర్శ‌లు గుప్పించారు. కేంద్రంలో త‌మ బలమైన ప్రభుత్వం ఉన్నందున ఇక్క‌డి అవినీతి నేతల ఆటలు సాగడం లేద‌న్నారు. పార‌ద‌ర్శ‌క‌మైన పాల‌న చేస్తున్న తాము ఎవరికీ భయపడబోమని చెప్పారు. ఏపీ నేత‌లు ప్ర‌తిసారి యూ టర్న్‌ తీసుకుంటున్నారంటూ విమ‌ర్శించారు. ఇంత‌కీ వీరు రాష్ట్రాభివృద్ధికి ఏం చేస్తున్నారు? త‌మ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే నన్ను తిడుతున్నారని చెప్పారు. ఇక్క‌డి నేత‌లు దోచుకున్న‌ది దాచుకోవ‌డానికే.. ఆరాట‌ప‌డుతున్నార‌ని చంద్ర‌బాబును ఉద్దేశించి ఆరోపించారు. గొప్ప‌లు చెప్పుకుంటున్న‌. ఇక్కడి నేతలు ఎలాంటి వారితో కూటమి కట్టారో ప్రజలు గ్రహించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మాయా కూటమి కట్టిన నేతలకు ఎలాంటి అజెండా లేద‌ని, నల్లధనం దాచుకున్న వారిపై తాను చర్యలు తీసుకోవడమే వీరి బాధకు కారణంగా మారింద‌న్నారు. ఢిల్లీలో బలమైన ప్రభుత్వం ఉంటేనే దేశం బాగుపడుతుంద‌ని, దేశ భ‌ద్ర‌త‌పై కఠిన నిర్ణయాలు తీసుకోవచ్బని రైతులు, జవాన్లు బాగుంటార‌ని వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పుల్వామా ఉగ్ర‌దాడిపై చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ఏపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మోదీ విమర్శించారు. వారు పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేతల వ్యాఖ్యల కార‌ణంగా సైనికుల స్థైర్యం దెబ్బతింటుందన్నారు. వీరు తమ మాటలతో దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కోట్ల మంది యువత ఆకాంక్షలను విశాఖ న‌గ‌రం నెర‌వేరుస్తుంద‌న్నారు. దశాబ్దాలనాటి విశాఖ రైల్వే జోన్‌ కలను సాకారం చేశామని ఆయ‌న తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here