Home ఎడ్యుకేషనల్/జాబ్స్ అయోధ్య పూర్వాపరాలు.. తీర్పు శాంతికి బాటలు వేయాలి

అయోధ్య పూర్వాపరాలు.. తీర్పు శాంతికి బాటలు వేయాలి

239
0

రాంపల్లి మల్లికార్జున్​రావు

మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేముందు ఆనాటి ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడైన గోపాలకృష్ణ గోఖలే సలహామేరకు దేశంలో తిరిగారు.ఆ సమయంలో వారికి కలిగిన అనుభవాలలో ఈ దేశంలోని సర్వసాధారణ వ్యక్తి హృదయములో రాముడిపైన భగవద్గీత పైన ఎంత భక్తి ఉన్నదో తెలుసుకున్నారు; అందుకే రామరాజ్య స్థాపనకై స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనమని సాధారణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాముడు ఈ దేశం ఆత్మ. 2075 సంవత్సరాలకు పూర్వం ఈ దేశాన్ని ఏకాచత్రాదిపత్యంగా పరిపాలించిన విక్రమార్కుడు అయోధ్యలోని రామజన్మభూమిలోని స్థలంలో భవ్యమైన రామమందిరం నిర్మించారు.

ఆ మందిరాన్ని 1528 సంవత్సరంలో బాబర్ సేనాని ఆ మందిరాన్ని కూలగొట్టి దానిపైన ఒక కట్టడం కట్టి దానికి బాబ్రిమసీదు అని పేరు పెట్టాడో లేదో కానీ తెలియదుకాని ఆ తదుపరి కాలంలో బాబ్రిమసీదుగా వెలుగులోకి వచ్చింది. అప్పటినుండి రామజన్మభూమి స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని మందిరాన్ని నిర్మించేందుకు పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. 1528 – 1934 వరకు 76 స్వాధీనం చేసుకునేందుకు సార్లు పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాలలో లక్షలమంది నిరాయుదులయిన రామభక్తులు బలిదానమైనారు. 1912 -34 మధ్య బ్రిటిష్ పాలనా సమయంలో ఆ స్థలాన్ని రామభక్తులు స్వాధీనం చేసుకున్నారు. కానీ బ్రిటిష్ వారు రామభక్తులను తరిమివేసి తమ అదీనం లోకి తెచ్చుకున్నారు.1885 సంవత్సరంలో రామ్ చబూత్ర, సీతారసోయి వెలుగులోకి వచ్చాయి. 1940 డిసెంబర్ 23 తెల్లవారుజామున రామజన్మభూమి స్థలంలో రాం లాలా విగ్రహం స్వయంగా ఆవిష్కృతమైంది. అప్పటినుండి అక్కడ రాముడు పూజలు జరుగుతూనే ఉన్నాయి.

1989 సంవత్సరం నుండి రామజన్మభూమి ఉద్యమం ఒక జాతీయ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. విశ్వ హిందూ పరిషత్ అద్వర్యంలో సాదుసంతులతో కూడిన రామ జన్మభూమి న్యాస్ ఏర్పడింది. రామజన్మభూమిన్యాస్ అధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమం జరిగింది. 1992లో రెండవసారి కరసేవకు పిలుపునిచ్చారు. ఆ సమయంలో దేశం అంతటనుండి పది లక్షల మంది కరసేవకులు సన్నద్ధమయ్యారు. లక్షమంది వరకు అనుమతించి ఆపివేయడం జరిగింది. ఆ సమయంలో కోర్ట్ నుండి ఏమైనా చెప్పించేందుకు విశేష ప్రయత్నం జరిగింది. కోర్ట్ నుండి ఏమీ చెప్పబడలేదు. దానితో ఆగ్రహించిన రామభక్తులు అక్కడ ఉన్న బాబర్ కట్టడాన్ని కూల్చి రామజన్మభూమి స్థలంలో చిన్న రామమందిరం నిర్మించారు. దానితో ఆగ్రహించిన ప్రభుత్వం వివాదాస్పదమైన 2.7 ఎకరాల భూమితో పాటు న్యాస్ సేకరించిన 67 ఎకరాలభూమిని కూడా స్వాధీనం చేసుకున్నది. కోర్టులో కేసు కొనసాగుతూనే ఉన్నది.

అయోధ్యలో రామజన్మభూమి స్థల విషయాలు బ్రిటిష్ వారి సమయం నుండి కోర్ట్ కేసులు నడుస్తున్నాయి. 1992 తరువాత సుప్రీం కోర్ట్ రామజన్మభూమికి సంబంధించిన అన్ని కేసులను అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ కు మార్చింది. 1993 నుండి 2000 వరకు అంటే సుమారు 13 సంవత్సరాలు విచారణ చేసి 2010 సెప్టెంబర్ 30 న జస్టిస్ ధరమ్ వీర్ శర్మ, జస్టిస్ సుధీర్ అగర్వాల్, జస్టిస్ బాషుతుల్లఖాన్ లతో కూడిన త్రిసభ్య కమిటీ తీర్పు చెప్పింది. అందులో ధరంవీర్ శర్మ ఆ స్థలం మొత్తం రాం లల్లాది అని ప్రకటించారు. మిగిలిన ఇద్దరు 2.7 ఎకరాల భూమిని ముగ్గురికి పంచారు. దానిపై ముగ్గురు కక్షిదారులు సుప్రీంకోర్ట్ తలుపుతట్టారు. సుప్రీమ్ కోర్ట్ లో 2014 వరకు కేసు నడచింది. సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి సుదీర్ఘంగా 40 రోజులు ఏకధాటిగా వాదనలు విన్నారు. 2014 అక్టోబర్ 16 లో వాదనలు పూర్తి చేసి 19 వరకు లిఖిత పూర్వకంగా ఎవరికైనా తమ వాదన తెలియజేసేందుకు అనుమతి ఇచ్చారు. 500 సంవత్సరాలుగా నడుస్తున్న రామజన్మభూమి స్థల వివాదంపై సుప్రీంకోర్ట్ తుది తీర్పు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. తీర్పు ఎట్లా ఉంటుంది అనే ఉత్కంఠతో దేశమంతా ఎదురు చూస్తున్నది. తుది తీర్పుకు రంగం సిద్ధమైన వేళ అకస్మాత్తుగా ముస్లిం పెద్దలు మూడు షరతులు ప్రతిపాదించింది. అందులో

1. దేశంలోని మసీదులన్నింటికి రక్షణ కల్పించాలి. కబ్జాలు, విధ్వంసాలు జరక్కుండా చట్టబద్ధమైన రక్షణ కల్పించాలి. ఈ మేరకు 1991 సంవత్సరంలో చేసిన ప్రార్థనా స్థలాల చట్టాన్ని గట్టిగా అమలు చేయాలి.

2. దేశంలోని పురావస్తు శాఖా అధీనంలో ఉన్న మసీదులలో ప్రార్థనను జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలి.

3. బాబ్రీ మసీదుకు ప్రతిగా అయోధ్య లోనే ఒక పెద్ద మసీదు కట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలి. అయోధ్య లోని 22 పాత మసీదుల మరమ్మత్తులకు సహకరించాలి. ఈ షరతులకు అంగీకరిస్తే రామజన్మభూమి పూర్తిగా వదులుకుంటామని ప్రతిపాదించారు.

రామజన్మభూమి ఈ షరతులను అంగీకరించలేదు.  అకస్మాత్తుగా ముస్లిం పెద్దలు ఈ విషయాలు  తెరపైకి ఎందుకు తెచ్చారు.  దాని నుండి ఏమి కోరుకుంటున్నారు. 1989 సంవత్సరం, రామ జన్మభూమి ఉద్యమం ప్రారంభ కాలంలో హిందూ సమాజ పెద్దలు, ముస్లిం పెద్దల ముందుకు ఒక ప్రతిపాదన తెచ్చారు. హిందూ సమాజానికి అత్యంత 

శ్రద్దాకేంద్రాలైన అయోధ్య, మధుర, కాశీ దేవాలయాలు ఇస్తే దేశంలో మిగతా స్థానాల జోలికి వెళ్ళము అని చెప్పారు కాని ఆ ప్రతిపాదనపై సానుకూల స్పందన రాలేదు. భారత దేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభమైన నాటి నుండి హిందువులు, ముస్లింలు కలిసి దేశ స్వాతంత్రం కోసం,  దేశంలో శాంతి కోసం పని చేసేందుకు మూడు సందర్భాలలో

పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది.

1. 1857 సంవత్సరం స్వాతంత్ర సంగ్రామ సమయం.

2.  ఖిలాఫత్ ఉద్యమ సమయంలో గాంధీజీ విశేష ప్రయత్నం చేశారు అప్పటి నుండి ముస్లిం లను కలుపుకొని స్వాతంత్ర పోరాటం చేయాలని ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. ఒకవైపు ఈ ప్రయత్నం జరుగుతుంటే రెండవ ప్రక్క ముస్లింలు దేశం ముక్కలు చేసే ముస్లింల కోసం స్వతంత్ర దేశం కోసం ప్రయత్నం చేస్తూ వచ్చారు.1947 ఆగస్టు 14న  దానిని సాధించుకున్నారు.

3. అయోధ్య ఉద్యమ సమయంలో రామజన్మభూమి న్యాస్ చేసిన ప్రతిపాదనకు ముస్లిముల నుండి సానుకూల స్పందన రాలేదు. ఇది చరిత్ర చెబుతున్న సాక్ష్యం. దానికి కారణం ఏమిటి? ఎందుకు ఈ సమస్య ఇంకా దేశాన్ని వెంటాడుతున్నది. స్వాతంత్రం వచ్చిన దగ్గరనుండి మత కలహాలు మతమార్పిడులు విధ్వంసం యథేచ్చగా సాగి పోయాయి, చారిత్రక విధ్వంసాలకు  మాకు సంబంధం లేదు అని విస్పష్టం చేసేందుకు  సిద్ధ పడటం లేదు. ఈ పరిస్థితులు దారి తీయడానికి కారణాలను ప్రఖ్యాత పురావస్తు పరిశోధకుడు కే.కే. మహమ్మద్  వ్యాఖ్యానాలను  ఈ సందర్భంగా సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం ఉచితం.

వామపక్ష చరిత్రకారులు పత్రికా రంగంలో తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకొని  అయోధ్యకు సంబంధించిన   యదార్థాలను ప్రశ్నిస్తూ అనేక వ్యాసాలు ప్రచురించారు. అవి సాధారణ  ప్రజలను గందరగోళంలో పడేశాయి. ఆ సమయంలో అయోధ్య విషయంలో సయోధ్య కు ప్రయత్నించిన ముస్లిం మతవాదుల మనసులో కూడా బాబ్రీ మసీదు వదులుకోలేము అనే వైఖరి వచ్చింది. కమ్యూనిస్టు చరిత్రకారుల  జోక్యంతో వారి మానసిక త  పూర్తిగా మార్చివేసింది. ఆ రెండు గ్రూపులో కలిసి సంయుక్తంగా చేసిన అల్లర్లలో అయోధ్య సమస్య పరిష్కారానికి ఉన్న అవకాశాలు అన్ని మూసుకుపోయాయి. దేశంలో వామపక్ష మేధావులు  స్వాతంత్ర పోరాట కాలం నుండి  అనుసరించిన వైఖరి దేశానికి ఇప్పటికీ ఎంతో నష్టం చేసింది. ఇంకా అది కొనసాగుతూనే ఉంది.

ముస్లింలలో క్రైస్తవులలో అన్ని మతాలను గౌరవించాలని దృక్పథం బలంగా లేక కపోవడం  వల్ల మిగతా మతాల పై వైషమ్యాలు వచ్చారు. దానికి ఉదారవాద మేధావులు వామపక్ష మేధావులు ఆజ్యం  పోస్తూనే ఉన్నారు.  భారతదేశంలో వేల సంవత్సరాల నుండి  వికసించిన,  అనేక మతాలు సంప్రదాయాల మధ్య సయోధ్య కుదిరి అందరూ సామరస్యంగా జీవిస్తున్నారు. కానీ ఇస్లాం, క్రైస్తవం  ఎప్పుడూ  తమ ప్రత్యేకత  చూపించుకుంటూ   ఇతర మతాలను ద్వేషిస్తూ నే ఉన్నది.  దానిలో ఉదారవాద   వామపక్ష మేధావుల పాత్ర  కీలకమైనది.  ఇప్పటికైనా ఈ  భేదతంత్రాన్ని, రాజకీయ నాయకుల ఎత్తుగడలను వమ్ముచేసేందుకు ప్రయత్నించి  దేశంలో శాంతి సామరస్యం సాధించేందుకు కృషి చేస్తారని ఆశిద్దాం.  అయోధ్య రామ జన్మభూమి పై దేశ సర్వోన్నత న్యాయస్థానం  ఇచ్చే తీర్పు శాంతి సామరస్యానికి బాటలు వేసేది గా ఉంటుందని ఆశిద్దాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here