Home breaking news అమిత్ షాను అందుకే కేసీఆర్ కలిశాడంటున్న బీజేపీ

అమిత్ షాను అందుకే కేసీఆర్ కలిశాడంటున్న బీజేపీ

285
0
అమిత్​ షాతో కేసీఆర్​

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​.. ఆ మధ్య (అక్టోబర్​ 4) ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ను కలిసొచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్​.. మోదీ, షా, రాజ్​నాథ్​ను కలవడంలో అభ్యంతరాలెందుకుంటాయి. ఉండనే ఉండవు. కానీ మోదీని కలిసిన తర్వాత షాను ఎందుకు కలిశాడంటూ ఈ మధ్య క్వచ్చన్​ వేస్తున్నారు. షాను కేసీఆర్​ ఎందుకు కలిశాడో తెల్లారి పేపర్లో విభజన సమస్యలు పరిష్కారించాలని కోరినట్టుగా, కొత్త జిల్లాలను గుర్తించాలని కోరినట్టుగా, చర్చించినట్టుగా వచ్చింది. ఈ వార్తను బీజేపోళ్లు కొట్టి పారేస్తున్నారు. ఛత్​ అది నిజం కాదంటున్నారు. అదే నిజమైతే.. ఆయనెంబడి పోయిన ఎంపీలు కేకే, బీబీ పాటిల్​ను.. రాజ్​నాథ్​ వద్దకు తీసుకెళ్లారు కానీ షా వద్దకు  ఎందుకు తీసుకెళ్లలేదంటున్నాడు. మరి ఏంటయ్య నిజమంటే.. శరణు జొచ్చాడులే అనేస్తున్నారు.

ఎందుకయ్యా అంటే ఓ నాయకుడు.. ఆ ఏముంది ఆ మధ్య సీఎం సన్నిహితులపై జరిగిన ఐటీ దాడుల గురించే కలిశారు. ఈ దాడుల్లో ఏవేవో పేపర్లు దొరికాయి. అందుకే పోయి కలిశాడంటున్నారు. ఈయన ఎంత కలిసినా అయితే కేంద్రం నుంచి రెస్పాన్సే రాలేదంటున్నాడు. అందుకే మళ్లీ.. మెగా కృష్ణారెడ్డిపై కూడా ఐటీ దాడులు జరుగుతున్న ముచ్చటను గుర్తు చేశాడనుకో. మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి.. ఇప్పుడు పాపులర్​ కాంట్రాక్టర్​. తెలంగాణ ప్రభుత్వం ఏ పని చేపట్టినా.. మెగా కృష్ణారెడ్డి పనులు చేస్తున్నారు. అది కాళేశ్వరమైనా.. మిషన్​ భగీరథ అయినా. అంతలా తెలంగాణ ప్రభుత్వంలో భాగమైన మెగాపై ఐటీ దాడులు జరుగుతున్నయంటే.. కేసీఆర్​పై కేంద్రం నజర్​ పెట్టినట్టేగా. అంతేగా అంటున్నారు బీజేపీ లీడర్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here