Home తాజా వార్తలు అమల ముఖ్య పాత్రలో వెబ్ సిరీస్

అమల ముఖ్య పాత్రలో వెబ్ సిరీస్

145
0

ప్రముఖ నటి అక్కినేని అమల చాలా రోజులు తరువాత మరో సారి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. జీ 5 ఆప్ నిర్మించిన వెబ్ సిరీస్ హై ప్రిస్ట్స్ లో అమల ముఖ్య పాత్ర పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌ ఏప్రిల్ 25 నుంచి జీ 5 ఆప్ లో ఆన్లైన్ అవుతుంది. ఈ సందర్భంగా జీ 5 ఆప్ బృందం హై ప్రిస్ట్స్ ట్రైలర్ ని విడుదల చేశారు. టారో రీడింగ్ నేపథ్యం లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ని పుష్ప డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లో అమల తో పాటు ప్రముఖు నటుడు బ్రహ్మాజీ, వరలక్ష్మి శరత్ కుమార్, సునైనా, బిగ్ బాస్ 2 ఫేమ్ నందిత తదితరులు నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ ఈ వెబ్సెరీస్ కి వర్క్ చేశారు. గతం లో ఎన్నో విజయవంతమైన వెబ్ సిరీస్లను అందించిన నేపథ్యంలో మరోసారి మరింతగా ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయతనంలో అక్కినేని అమలతో ఈ హై ప్రిస్ట్స్ అనే సిరీస్ ని నిర్మించామని జీ 5 ఆప్ బృందం తెలిపింది. అమ‌ల మాట్లాడుతూ
కథల ఎంపిక లో చాల జాగర్తలు తీసుకోవడం వ‌ల్ల తెర‌ ఫై తక్కువుగా కనిపిస్తున్నా అని చెప్పారు. చాల రోజులు తరువాత ఈ హై ప్రైస్ట్స్ స్కిప్ట్ రావడం, డైరెక్టర్ పుష్ప చెప్పిన లైన్ నచ్చడం తో ఈ ప్రొజెస్ట్ లో నటించేందుకు ఒప్పుకున్నాన‌ని తెలిపారు. నాకు బాగా ఆసక్తిగా అనిపించే టారో రీడింగ్ నేపథ్యంలో ఈ వెబ్సెరీస్ కథ ఉండటం నాకు బాగా నచ్చింద‌ని చెప్పారు. ప్రేక్షకులకి కూడా నచ్చుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.
Please Subscribe our Website And Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here