Home breaking news అభినంద‌న్‌కు పాక్ ప‌త్రిక అభినంధ‌న‌

అభినంద‌న్‌కు పాక్ ప‌త్రిక అభినంధ‌న‌

149
0

మ‌న దేశ ఫైల‌ట్ అభినంద‌న్‌ను పాక్ మీడియా అభినందించింది. ఈ మేర‌కు ఆ దేశ‌పు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక డాన్ ఒక క‌థ‌నం ప్ర‌చురించింది. పాక్ వైమానిక దాడుల‌ను తిప్పికొట్టే స‌మ‌యంలో మ‌న దేశానికి చెందిన మిగ్-21 విమానం కూలిపోయింది. ఆ విమానం ఫైల‌ట్ అభినంద‌న్ మాత్రం క‌ర్త‌వ్యాన్ని మ‌ర‌వ‌లేదు. త‌న వ‌ద్ద కీల‌క ప‌త్రాల‌ను పాక్‌కు అంద‌కుండా చేయ‌డానికి న‌మిలి మింగేశాడ‌ని త‌న క‌థ‌నంలో పేర్కొంది.

డాన్‌ వార్తా పత్రిక కథనం ప్రకారం.. ఓ పైలట్‌ పాక్‌ భూభాగంలో దిగాడు. అక్కడున్న కొందరు యువకుల్ని ‘ఇది ఇండియానా..? పాకిస్తానా?’ అని అడిగాడు. దాంతో అక్కడున్న యువకుల్లో ఒకరు ఇది ఇండియా అని బదులిచ్చాడు. తాను భార‌త్‌లోనే ఉన్నానన్న ఆనందంతో అభినంద‌న్ నినాదాలు ఇచ్చాడు. అక్కడున్న యువకుల్లో కొందరు అభినందన్‌ భారత నినాదాలు చేయడంతో కోపం పట్టలేకపోయారు. పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ అరిచారు. విషయం అర్ధమైన అభినందన్‌ పిస్టల్‌ బయటకు తీశాడు. దీంతో యువకులు రాళ్లు పట్టుకుని అతనిపైకి దాడికి యత్నించారు. అభినంద‌న్ త‌న చేతిలోని పిస్ట‌ల్‌తో గాల్లోకి కాల్పుడు జరుపుతూ.. పెద్ద గాయమైనా అతను అరకిలోమీటరు దూరం పరుగెత్తి నీటి కాలువ వ‌ద్ద‌కు చేరుకొని తన జేబులో ఉన్న కొన్ని పత్రాలను మింగేశాడు. మరికొన్నింటిని ముక్కలుగా చేసి నీటిలో కలిపేశాడు. ఇది మ‌న దేశ‌పు ప‌త్రిక‌లు రాసిన క‌థ‌నం కాదు. పాక్ ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక డాన్ ప్ర‌చురించిన క‌థ‌నం.

డాన్ ప‌త్రిక క‌థ‌నం చ‌ద‌వండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here