Home breaking news అపార్ట్​మెంట్​​కు వెళ్తేనే.. అన్ని వివరాలివ్వాలి.. ఎన్నార్పీపై ఆలోచింపజేసే ఓ పోస్టు

అపార్ట్​మెంట్​​కు వెళ్తేనే.. అన్ని వివరాలివ్వాలి.. ఎన్నార్పీపై ఆలోచింపజేసే ఓ పోస్టు

236
0
ఫొటో: ఇంటర్​నెట్​ నుంచి సేకరణ

–ఆదిత్య

సోషల్​ మీడియాలో ఆలోచింపజేసే ఓ పోస్ట్​ కన్పించింది. ఆ పోస్ట్​లో ఏముందంటే.. నేను ఒక ఆపార్ట్​మెంట్​కు వెళ్తేనే.. నన్ను ఆపి అన్ని వివరాలు అడిగారు. అలాంటిది ఎన్నార్సీ. ఎన్నార్పీ, పౌరసత్వ చట్టంలో వివరాలు అడగడంలో తప్పేమిటీ..? అని అతడు ప్రశ్నించాడు. అతడేమీ రాశారంటే.. ‘నేను నా స్నేహితుడిని కలవడానికి ఒక అపార్ట్​మెంట్​కు వెళ్లాను. ముందున్న సెక్యూరిటీ గార్డ్​ నా ముందు రిజిస్టర్​ పెట్టారు. అందులో నా పేరు. ఎక్కడి నుంచి వచ్చాను. ఎవరి కోసం వచ్చానో పేర్కొంటూ  నా ఫోన్​ నెంబర్​ రాశాను. సంతకం పెట్టాను. ఆ తరువాత నేను ఎవరినైతే కలవడానికి వచ్చానో.. ఆ స్నేహితుడికి సెక్యూరిటీ గార్డ్​ ఫోన్​ చేసి.. మీ కోసం పలాన మనిషి వచ్చారు. పంపించాలా..?  అని అడిగారు.  నా స్నేహితుడు పంపించు అన్న తరువాతే నన్ను లోనికి పంపించారు. ’ అని పోస్ట్​లో రాశారు.  

ఒక ఆపార్ట్​మెంట్​లో ఉండేదీ మహా అయితే 50 నుంచి వంద కుటుంబాలు. ఇంకా పెద్దదైతే.. మరిన్నికుటుంబాలు. ఆ అపార్ట్​మెంట్​లో నివసిస్తున్న వారి భద్రత కోసం చుట్టూ గోడ. ఒక గేటు. అక్కడి మూడు షిప్టుల్లో సెక్యూరిటీ గార్డ్స్​. ఆ అపార్ట్​మెంట్​లో నివసించే వారి కోసం ఎవరూ వెళ్లినా.. ఒక రిజిస్టర్​ ముందు పెట్టి పూర్తి వివరాలు నమోదు చేసిన తరువాత ఇన్​ టైం.. రాసి సంతకం పెట్టిన తరువాతే లోపలి వ్యక్తికి ఫోన్​ చేసి వివరాలు చెప్పిన తర్వాతే లోనికి వెళ్లనిస్తారు. తిరిగి వచ్చేప్పుడు అవుట్​ టైం రాసిన తర్వాత బయటకు వెళ్లనిస్తారు. అంటే ఒక 50 నుంచి వంద కుటుంబాలు ఉండే అపార్ట్​మెంట్​కు వెళ్తేనే ఇన్ని ఆంక్షలు.. వివరాలు చెప్పాలి. అలాంటిది 130 కోట్ల మంది జీవించే దేశంలోని పౌరుల వివరాలు సేకరిస్తే తప్పేమిటనీ సదరు పోస్ట్​ చేసిన వ్యక్తి ప్రశ్న. నిజమే కదా..? ఇది నిజంగా ఆలోచింపజేసే పోస్టే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here