Home breaking news అపర మేతావి.. సత్య నాదేళ్ల బుర్రకో హాట్సాప్

అపర మేతావి.. సత్య నాదేళ్ల బుర్రకో హాట్సాప్

757
0
ఫొటో: ఇంటర్​నెట్​ నుంచి

–ఆదిత్య

మైక్రోసాఫ్ట్​ సత్య నాదేళ్ల అంటే అబ్బో అనుకున్నాం కదా ఇన్నాళ్లు. ఆయన కూడా తాను  ఏది చెప్పినా.. భారత్​లో తందాన అంటారు అనుకున్నట్టున్నారు. అట్లనే అంటున్నారు కొన్నాళ్లుగా మన తెలుగు పత్రికల్లో. అబ్బో ఆయన గురించి పుంఖాను పుంఖానుగా స్టోరీలే స్టోరీలు. అపర బ్రహ్మ.. విజ్ఞాన ఖని ఇలా అనుకుంటూ వెళ్లాముగా.. ఇప్పుడు తుస్సున తేలిపోయింది అయనకంత సీన్​ లేదని. ఆయన బుర్రలో పుస్తక జ్ఞానం తప్ప మరొకటి లేదని  సరే ఇంతకూ ఆయనేమన్నాడు అంటే.. బంగ్లాదేశ్​ నుంచి వలస వచ్చినోడు ఈ దేశంలో ఇన్ఫోసిస్​ కంపెనీకి సీఈవో కావాలని అన్నాడు.  అయ్యా బాబు నాదేళ్ల.. తమరు కూడా అధికారికంగా ఇక్కడి నుంచి వెళ్లి..అక్కడి పౌరసత్వం పొందిన తరువాతే మైక్రోసాఫ్ట్​లో నీకీ పోస్టు దక్కింది సామి. దొంగచాటుగా వెళ్తే జైలుకు వెళ్లేవాడివి. ఇది కూడా తెలియకపోతే ఎలా నాదేళ్ల.

చంద్రబాబు సావాసం చేసినందుకే ఇలా అయిపోయావా..? అనుకుంటే.. చంద్రబాబు కూడా పౌరసత్వ చట్ట సవరణపై సప్పుడు చేయడం లేదుకదా. మరి తమరెందుకు ఇలా మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్​, పాకిస్థాన్​, అప్ఘనిస్తాన్​కు చెందిన మైనార్టీలు.. భారత్​కు వస్తే వారికి పౌరసత్వం ఇచ్చేందుకు సవరణ చట్టం చేశారు బుజ్జి. ఎన్నార్సీ, ఎన్నార్పీ వేర్వేరు నాదేళ్ల. ఈ మధ్య కాంగ్రెసోళ్ల మీటింగ్​ మాబాగా చూసినట్టున్నావు. కమ్యూనిస్టుల ర్యాలీలు చూసినట్టున్నావు. అందుకే నీకీ దురద అంటింది. ఇదే కాంగ్రెస్​ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్​, కమ్యూనిస్టు నుంచి ప్రకాశ్​ కరత్​ కూడా అప్పట్లో.. బంగ్లాదేశ్​ తదితర దేశాల నుంచి భారత్​కు వచ్చిన మైనార్టీలూ అంటే ఆయా దేశాల్లో ముస్లిమేతరులు మాత్రమే. వాళ్లకు పౌరసత్వం ఇవ్వాలని డిమాండ్​ చేసినోళ్లే..  ఆళ్ల డిమాండ్​ ఇప్పుడు బీజేపీ నెరవేర్చే సరికి రాజకీయాలు గుర్తుకొచ్చి.. నాలుక మడతెట్టేశారు. నువ్వేమో వాళ్ల మాయలో పడ్డట్టున్నావు.

పుస్తక జ్ఞానం ఉంటే సరిపోదు.. రాజకీయ పరిజ్ఞానం కూడా కావాలి. దేశం.. దేశ సమగ్రత, రక్షణ, భద్రత వంటి అంశాలకు సంబంధించిన అంశాల్లో ఊరికే నోటికొచ్చినట్టు మాట్లాడితే.. తమరి మేతా సంపత్తి ఎంతుందో జనాలకు ఇప్పుడు తెలిసినట్టు తెలిసిపోద్దీ. పరువూ పోద్ది. ఆయ్యా బాబూ పౌరసత్వం అంశంపై తమరి వ్యాఖ్యలకు మీ మైక్రోసాఫ్ట్​ ఓనర్​ బిల్​గేట్స్​ను ఓకే అంటాడేమో అడుగు. ఆయన ఏం చెబుతారో విను. నీదీ ఆయనదీ ఒకటే బానీ అయితే .. ఇంతకంటే బ్రహ్మజ్ఞానులు లేరని మీరిద్దరికి కలిపి వేసేస్తాం వీరతాడు.ఓకేనా సత్య నాదేళ్ల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here