Home ఎడ్యుకేషనల్/జాబ్స్ అన్నింటిలో తెలంగాణే నెంబర్ వన్.. ఇందులో మాత్రం..!

అన్నింటిలో తెలంగాణే నెంబర్ వన్.. ఇందులో మాత్రం..!

303
0

పేరెత్తి ఎత్తగానే.. మనమే నెంబర్​వన్​. అని తెలంగాణ ముఖ్యమంత్రు‘లు’, మంత్రులు, ఎమ్మెల్యేలు టీఆర్​ఎస్​ నాయకులు తమ నోటెంబడి అలవోకగా చెప్పేస్తూ ఉంటారు. అది కాళేశ్వరమా..? సంక్షేమ పథకాలా.? ఇలా చెప్పుకుంటూ పోతే.. అన్నింటిలో నెంబర్​వన్నే. చాటుమాటుగా మందు అమ్మకాల్లో కూడా మనమే నెంబర్​వన్​ అని చెవుల్లో గొణుక్కుంటారునుకో. అది వేరే విషయం. నిన్ననే నీతిఅయోగ్​ ఒక రేటింగ్​ విడుదల చేసింది. ఈ రేటింగ్​లో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్​ ముందంజలో ఉంది.

ఇంతకీ రేటింగ్​లో ఎందులోనంటే.. పాఠశాల స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్న విషయంలో (2016‌‌‌‌_17) సుమా. నీతిఅయోగ్​ చెప్పిందంటే.. మనమే ముందంజలో ఉండాలే అనుకుంటాం. ఎందుకంటే.. మిషన్​ భగీరథకు నిధులివ్వాలని సిఫారస్​ చేసినా.. కేంద్రం ఇవ్వలేదని తెలంగాణ మంత్రులు ఒకటే విమర్శలు చేస్తున్నారు కదా. అందుకే తెలంగాణను ముందంజలో సిఫారసు చేస్తుందని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే.. నాణ్యమైన విద్య అందించడంలో తెలంగాణ 14వ స్థానంలో ఉంది. అదేంటి చైతన్య, నారాయణ ఉండగా.. ఇంత కిందికా.. అనుకోవద్దు సుమా.

కేరళ, రాజస్థాన్​ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. కర్ణాటక 3, ఆంధ్రప్రదేశ్​ 4వ స్థానంలో ఉంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం 5వ స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్​ 20వ స్థానంలో నిలిచింది. అన్నింటిలో మొదటి స్థానంలో నిలిచామని చెప్పుకునే మన మంత్రులు ఈ విషయంలో ఎందుకు వెనుకబడ్డారో చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు పక్కా బిల్డింగ్​లున్నాయి. మోడల్​ స్కూల్స్​, కేజీవీబీ స్కూల్స్​, ప్రతి నియోజకవర్గంలో రెసిడెన్సియల్​ స్కూల్స్​ ఉన్నాయి. టీచర్లు సరిగా లేరనుకో. అయినా తెలంగాణే నెంబర్​వన్​లో ఉండాలి. కానీ 14లో ఎందుకున్నది. ఇక్కడేదో జరిగింది. అది కేంద్రం కుట్రనా..? తెలంగాణ నెంబర్​వన్​లో ఉందని నీతిఅయోగ్​ చెప్పినా.. కేంద్రం 14లోకి నెట్టేసిందేమో..? కావచ్చు. ఎందుకుంటే రేపు టీఆర్​ఎస్​ అభిమానులు ఇదే చెబుతుండొచ్చు.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here