Home breaking news అధ్య‌క్షుడి ఎంపిక‌ ముహూర్తం ఖరారు కావడానికి 22 త‌ర్వాతే ముహూర్తం

అధ్య‌క్షుడి ఎంపిక‌ ముహూర్తం ఖరారు కావడానికి 22 త‌ర్వాతే ముహూర్తం

169
0
అధ్య‌క్షుడి ఎంపిక‌ ముహూర్తం ఖరారు కావడానికి 22 త‌ర్వాతే ముహూర్తం
రాహుల్

న‌మ్మ‌కాలు ఉన్న‌వారు.. మంచి రోజు చూసుకొని ముహూర్తం పెట్టుకుంటారు. లేనివాళ్లు ఎప్పుడైతే అప్పుడే సై అంటారు. కానీ ముహూర్తం పెట్టుకోవ‌డానికే ఒక డేట్ చూసుకొని ఆ త‌రువాతే ముహూర్తం పెట్టుకునే వారిని మూఢ న‌మ్మకాలు క‌ల్గిన వారు అనుకోవాలి. లేకుంటే నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో నిరంత‌రం జాప్యం చేసే వారై ఉంటారు. కాంగ్రెస్ కూడా చివ‌రి అప్ష‌న్ ఎన్నుకున్న‌ట్టుంది. లోక్‌స‌భ ఫ‌లితాలు వెలువ‌డిన వెంట‌నే.. కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి రాహుల్ రాజీనామా చేసేసి మీదారి మీరు చూసుకోండి అన్న‌ట్టుగా ఉండిపోయారు. నెల‌కు పైగా బ‌తిమాలి బామాలిన రాహుల్ మ‌న‌సు క‌ర‌గ‌లేదు స‌రికదా కొత్త వారిని ఎన్నుకోండి అంటూ ఉచిత స‌ల‌హా కూడా ఇచ్చేశారు.

స‌రే ఎన్నుకుందామంటే.. ప్రియాంక వాద్రా అమెరికాలో ఉన్నారు. సోనియా కూడా అమెరికా… అంటున్నారు. చివ‌ర‌కు రాహుల్ కూడా అమెరికా అంటున్నారు. కాంగ్రెస్‌కు అధ్య‌క్షుడిని ఎన్నుకోవాలంటే.. వాళ్లు ముగ్గురు ఉండాల్సిందే. కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీలో ఎన్నుకోవడం ఉంటుంది. స‌మావేశం ఏర్పాటు చేద్దామంటూ ప్రియాంక లేరు. స‌రే అలా చెబితే బాగుండ‌దు క‌దా.. అందుకే పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగిసిన త‌ర్వాత స‌మావేశం ఏర్పాటు చేసుకుంటామ‌ని కొంద‌రు.. ఇంకా రాహుల్ రాజీనామాను అంగీక‌రించ‌లేద‌ని మ‌రికొంద‌రు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అందుకు 22 వ తేదీ త‌రువాతే స‌మావేశం అంటే స‌మావేశం తేదీ కూడా ఇంకా ముహూర్తం పెట్టుకోలేదు. స‌మావేశానికి ముహూర్తం. అధ్య‌క్షుడి ఎంపిక‌కు ముహూర్తం. ఆ త‌రువాతే ఎంపిక జ‌రుగుతుందా..? లేదా అన్నది తేలుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here