Home breaking news అదే సజ్జనార్.. అలాంటి ఎన్​కౌంటరే పునరావృతం

అదే సజ్జనార్.. అలాంటి ఎన్​కౌంటరే పునరావృతం

149
0
ఫొటో: ఇంటర్​నెట్​ నుంచి

– వికాస్​ రుషి

2008లో జరిగిన ఎన్​కౌంటర్​ లాంటి ఎన్​కౌంటర్​ మళ్లీ జరిగింది. ఆనాడు వరంగల్​లో ఎన్​కౌంటర్​ జరిగిన సమయంలో ఆ జిల్లా ఎస్పీగా సజ్జనార్​ ఉన్నారు. ఈనాడు జరిగిన ఎన్​కౌంటర్​ సమయంలో సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్​గా సజ్జనార్​ ఉన్నారు. 2008లో వరంగల్​లో ఇద్దరు యువతులపై యాసిడ్​ దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక యువతి మరణించారు. అప్పడు డిమాండ్​ నిందితులకు  ఉరిశిక్ష వేయాలనే వచ్చింది. యాసిడ్​ దాడి జరిపిన ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు.. వారు పోలీసులు నుంచి తప్పించుకొని పారిపోతుండగా.. జరిపిన కాల్పుల్లో చనిపోయారు. సత్వరం న్యాయం జరిగింది. ఇప్పుడు ‘దిశ’పై హత్యాచారం జరిగిన సంఘటన వెలుగు చూసినప్పటి నుంచి అందరి నుంచి వస్తున్న డిమాండ్​ ఒక్కటే.. అది నిందితులను ఉరితీయాలి. లేదా ఎన్​కౌంటర్​ చేసి చంపేయాలి. పార్లమెంట్​కూడా కదిలింది బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలంటూ పార్లమెంట్​లో చర్చ జరిగింది.

వరంగల్​లో జరిగిన ఎన్​కౌంటర్​ (ఫైల్​ఫొటో)

కేంద్రమంత్రులు.. వివిధ రాజకీయ పార్టీల నాయకుల నుంచి సత్వర న్యాయం. నిందితులకు ఉరితీయాలంటూ డిమాండ్​ వచ్చింది. ఫాస్ట్​ ట్రాక్​ కోర్టు ఏర్పాటు చేసేశారు. ఈ వార్త వినగానే.. ఆ కేసు సాగదీతే అనుకున్నారు చాలా మంది. అన్ని వర్గాల నుంచి సత్వర న్యాయం డిమాండ్​ పెరిగిపోవడంతో  పోలీసులపై ఒత్తిడి పె రిగింది. ఏదో ఒకటి చేస్తే గానీ తమపై ఉన్న బరువు దిగదని అనుకొని ఉంటారు. దీనికి ఏకైక మార్గం.. వేగంగా…  వేగంగా…  విచారణ జరపాలి.  ఇదే విషయాన్ని పై నుంచి అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఆదేశాలుగా వచ్చి ఉంటాయి.  అందుకే విచారణలో భాగంగా  దిశపై హత్యాచారం చేసిన నలుగురిని సంఘటన స్థలం వద్దకు తీసుకెళ్లారు. అంతే వారు పోలీలసుపై  తిరగబడ్డారు. పారిపోవడానికి ప్రయత్నించారు. విధిలేని.. విధిలేని పరిస్థితుల్లో పోలీసులు కాల్పులు జరిపారు. నిందితులు చనిపోయారు. వారు చేసిన నేరానికి సరైన చోట.. సరైన సమయంలో శిక్ష పడి చనిపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ప్రశాంతం. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  మహిళలు ప్రశాంతంగా.. ప్రశాంతంగా.. రోడ్లపై భయం లేకుండా తిరగవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here