Home breaking news అది పొలమైనా.. గిలమైనా.. రాజు తలుచుకుంటే అడ్డంకేముంది

అది పొలమైనా.. గిలమైనా.. రాజు తలుచుకుంటే అడ్డంకేముంది

335
0
కొండపూర్​లోని రైతు భూమిలో మట్టిపోసిన దృశ్యం

–వికాస్​ రుషి

రాజు తలుచుకుంటే.. ఏదైనా చేసేస్తాడు. ఆయనకు అడ్డూ అదుపు ఉండదు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి రాజు. ఆయన తలుచుకున్నవన్నీ చేస్తేస్తున్నారు. అడ్డు చెప్పేవారు ఎవరున్నారు. అడ్డుకునే వారు ఎవరున్నారు. ఉన్న ప్రతిపక్షాలు నిర్వీర్యమై పోయాయి. ప్రశ్నించే శక్తి లేకుండా పోయింది. వారిని ఆ రేంజ్​లో దెబ్బతీశారు కేసీఆర్​. సరే.. ఇప్పుడు యాదాద్రి జిల్లాలో శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయాన్ని పునరుద్దరిస్తున్నారు. ఈ ఆలయానికి సీఎం కేసీఆర్​ హైదరాబాద్​ నుంచి రావాలంటే.. 70 కిలో మీటర్లు. అదే ఎర్రవెళ్లిలోని ఫాంహౌస్​ నుంచి రావాలంటే 30 కిలో మీటర్లు. అందుకే కొత్తగా ఎర్రవెళ్లి టూ యాదాద్రికి రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన రాజు కాబట్టి.. అధికారులు దగ్గరుండి పనులు చేస్తున్నారు.

ఇక్కడ విషయమేమిటంటే.. ఎర్రవెళ్లి నుంచి తుర్కపల్లిలోని వాసాలమర్రి గ్రామం వరకూ 12 కిలోమీటర్ల దూరం. ఇందులో  యాదాద్రి జిల్లాకు సంబంధించి 4.6 కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడ రోడ్డు నిర్మించడంలో తప్పులేదు. దానికి నిబంధనల ప్రకారం రైతుల నుంచి భూమిని తీసుకొని నిర్మించవచ్చు. ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. సీఎం పేరు చెప్పి.. రైతులకు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి నోటీసులు అందించకుండా సాగు భూముల గుండా  రోడ్డు వేసేస్తున్నారు. . పైగా కరెంట్ కనెక్షన్ కట్ చేయించారు. బోరు బావులను కూడా మూసేశారు. ఇదేంటని అడిగితే  సీఎం ఆర్డర్ అని చెబుతున్నారు.  రైతుల గోడు విన్న  కలెక్టర్ పనులు ఆపివేయాలని ఆదేశించారు. చత్​ మాకు సీఎం ముఖ్యం కలెక్టర్​ కాదని అనుకున్నారేమో.. రోడ్డు పనులు మాత్రం చేసేస్తున్నారు.  అందుకే అంటారు రాజు తలుచుకుంటే దేనికి కొదువ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here