Home తాజా వార్తలు అతి విశ్వాసం.. ఆకాశంలో ఉన్న కేసీఆర్‌ను కిందికి దింపింది

అతి విశ్వాసం.. ఆకాశంలో ఉన్న కేసీఆర్‌ను కిందికి దింపింది

256
0
  • వికాస్ రుషి

అతి విశ్వాసం కొంప‌కు చేట‌ని ఊరికే అన‌లేదు. ఈ అతి విశ్వాసంతో ఆకాశంలో ఉన్న‌ కేసీఆర్‌ను తెలంగాణ ప్ర‌జ‌లు కిందికి దింపారు. ఐదు సిట్టింగ్ సీట్ల‌లో టీఆర్ఎస్‌ను ఓడించారు. ఏమీ లేద‌న్న బీజేపీని గెలిపించారు. స‌రిగ్గా ఐదు నెల‌ల క్రితం.. జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అఖండ మెజారిటీ. ఆన‌క లాక్కున అద‌న‌పు సంఖ్య‌. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బ‌ల‌వంత‌మైన గెలుపు. ఆ త‌రువాత లాక్కున్న అద‌న‌పు గెలుపు. మూడు నెల‌లు మంత్రివ‌ర్గం ఏర్పాటు లేదు. క‌రెక్టు కాదు అని చెప్పేవారే లేరు. మ‌ధ్య‌లో మూడు ఎమ్మెల్సీల ఓట‌మి.. గెలుపునే త‌న ఖాతాలో వేసుకున్న కేసీఆర్‌.. ఈ ఒట‌మిని ప‌ట్టించుకోలేదు. దీన్ని లెక్కలోకే తీసుకోలేదు. ఏం చేసినా.. న‌న్న‌నే వాడే లేడన్న అతి ఆత్మ‌ విశ్వాసం. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోరాతిఘోరంగా ఓడిపోయిన బీజేపీ న‌న్నేం చేస్తుందన్న అతిధీమా. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలే మ‌ళ్లీ.. అంటూ కారు.. 16.. స‌ర్కారు నినాదంతో పార్ల‌మెంట్ క‌ధ‌న‌రంగంలోకి దిగాడు కేసీఆర్‌. క‌ర్ర విడిచి సాము చేసిన‌ట్టు.. జాతీయ రాజ‌కీయాల్లో ప్ర‌వేశిస్తా.. ఊరు వాడా ఏకం చేస్తా.. అంటూ దేశ‌మంతా తిరిగిండు. రాష్ట్రంలో ప్ర‌జ‌ల మ‌న‌సు ఎలా ఉందో గ్ర‌హించ‌లేక పోయాడు. జాతీయ రాజ‌కీయాల్లో ప్ర‌వేశిస్త అనుకున్న‌ప్పుడు ఏ విధంగా వ్య‌వ‌హ‌రించాలో తెలియ‌కుంటే ఎలా..? దేశ భ‌ద్ర‌త‌పై నోటికొచ్చినట్టు.. మేము చాలా చేశాము స‌ర్జిక‌ల్ స్ట్రైక్ అంటూ భీరాలు ప‌లికాడు. హిందుగాళ్లు బొందుగాల్లు అంటూ నోరూ జారాడు. నేనేం చేసినా.. చెల్లుత‌ద‌నుకొని ప‌సుపు, జొన్న రైతుల‌ను పట్టించుకోలేదు. ఆదివాసీల‌పై నోరూ జారాడు. లంబాడీలతో క‌లిసే ఉండండి హుకూం జారీ చేశాడు. టీఆర్ ఎస్ ఏర్పాటైన‌ప్ప‌టి నుంచి వెన్న‌ముఖ‌ల నిల‌బ‌డి.. పార్టీకి ఎన్నో విజయాల‌ను అందించిన‌ హ‌రీశ్‌ను మెద‌క్‌కు ప‌రిమితం చేశారు. కొడుకును నెత్తిన పెట్టుకున్నారు. క‌విత కోసం నిజామాబాద్‌లో రాజ‌కీయ కురువృద్ధుడు.. డీ శ్రీనివాస్‌ను ఘోరంగా అవ‌మానించారు. ఇవ‌న్నీ కేసీఆర్‌కు ఎదురు తిరిగి.. ఇంట్లో కుంప‌టి రేగేలా చేశాయి. మెద‌క్‌కే ప‌రిమిత‌మైన హ‌రీశ్‌..త‌న శ‌క్తి నిరూపించుకున్నాడు. అంతా తానై మూడు ల‌క్షల మెజార్టీతో ప్ర‌భాక‌ర్ రెడ్డి ని గెలిపించ‌కున్నాడు. నిజామాబాద్‌లో రైతులు.. యువ‌రాణి క‌విత‌ను ఘోరాతిఘోరంగా ఓడించారు. అక్క‌డ గెలిచింది డీఎస్ కొడుకు అర్వింద్‌. క‌రీంన‌గ‌ర్‌లో హిందుగాళ్లు.. బొందుగాళ్లు అన్నందుకు.. ఓట‌మి దెబ్బ ఎలా ఉంటుందో హిందూవాహినిలో నిత్యం తిరిగే బండి సంజ‌య్ ను గెలిపించడం ద్వారా తెలంగాణ ప్ర‌జ‌లు కేసీఆర్‌కు ఓట‌మి రుచి చూపించారు . ఈ ఓట‌మి కేసీఆర్ ఇంటికే. ఆదివాసీలు, లంబాడీల మ‌ధ్య జ‌రిగిన పంచాయితీ ప‌ట్టించుకోకుండా.. లంబాడీల వైపున నిల‌బ‌డిన కేసీఆర్‌కు ఆదివాసీలు త‌మ తుడుందెబ్బ రుచి చూపించారు. ఆదివాసీల‌ను ఏకం చేసిన సోయం బాబూరావు గెలిచారు. మ‌రో ప‌క్క కాంగ్రెస్ త‌ర‌పున ముగ్గురు హేమా హేమీలు ఎంపీలుగా గెలిచారు. న‌ల్ల‌గొండ‌లో ఉత్త‌మ్‌కుమార‌రెడ్డి, టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లైన వ‌న‌గిరిలో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, మ‌ల్కాజ్‌గిరిలో రేవంత్‌రెడ్డి గెలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here