Home breaking news అడుసుతొక్క‌నేల కాళ్లు క‌డ‌గ‌నేల – క్ష‌మాప‌ణ చెప్పిన అజంఖాన్‌

అడుసుతొక్క‌నేల కాళ్లు క‌డ‌గ‌నేల – క్ష‌మాప‌ణ చెప్పిన అజంఖాన్‌

261
0
అడుసుతొక్క‌నేల కాళ్లు క‌డ‌గ‌నేల - క్ష‌మాప‌ణ చెప్పిన అజంఖాన్‌

అడుసుతొక్క‌నేల కాళ్లు క‌డ‌గ‌నేల అన్న‌ది పెద్దలు చెప్పేమాట‌. అందుకే పెద్ద‌ల మాట చ‌ద్ది మూట అంటారు. స‌మాజ్‌వాది పార్టీ ఎంపీ అజంఖాన్ ఈ మాట‌లు ఎక్క‌నట్టున్నాయి. అందుకే నోరుంది క‌దా అని.. డిప్యూటీ స్పీక‌ర్ ర‌మాదేవిని చూస్తూ ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడారు. ట్రిపుల్ త‌లాఖ్ బిల్లుపై అజంఖాన్ మాట్లాడుతూ స్పీక‌ర్‌ను ఉద్దేశించి త‌దేకంగా మీ క‌ళ్ల‌లోకి చూస్తూ మాట్లాడాల‌నుందంటూ వ్యాఖ్యానించారు. అది కాస్తా రికార్డుల కెక్కింది లొల్లి మొద‌లైంది. పార్టీల‌కు అతీతంగా మ‌హిళా ఎంపీలంద‌రూ ఖండిస్తూ అజంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. దీంతో స్పీక‌ర్ ఓం ప్రకాశ్ బిర్లా కూడా సోమ‌వారం త‌న ఎదుట హాజ‌రై భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆదేశించారు. అయిన‌ప్ప‌టికీ.. తాను మాట్లాడిన దాంట్లో త‌ప్పేమీ లేద‌ని, ర‌మాదేవిని త‌న సోద‌రిగా భావిస్తున్నానంటూ బుకాయించే ప్ర‌య‌త్నం చేశారు. అయినా సద్దుమ‌ణ‌గ‌లేదు. దీంతో విధిలేని ప‌రిస్థితుల్లో స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేష్‌యాద‌వ్‌ను వెంట తీసుకొని స్పీక‌ర్‌ను క‌లిశారు. చివ‌ర‌కు అజాంఖాన్ క్ష‌మాప‌ణ చెప్పారు. ఆయ‌న క్ష‌మాప‌ణ చెప్పినా.. ర‌మాదేవి మాత్రం అంగీక‌రించ‌లేదు. అజాంఖాన్ ప్ర‌తిసారి ఇదే విధంగా మాట్లాడుతున్నార‌ని, ఎన్నిమార్లు చెప్పినా అత‌డి తీరులో మార్పు రావ‌డం లేద‌ని తెలిపారు. ఇప్ప‌టికైనా నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ‌డం మానుకోవాల‌ని హెచ్చ‌రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here