Home breaking news అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఇక్కడే తేలిన జూపూడి

అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఇక్కడే తేలిన జూపూడి

228
0
జగన్​, చంద్రబాబుతో జూపూడీ

అప్పుడెప్పుడో.. భూమి ఎలా ఉంటుందని పంచాయితీ జరిగిందంట. ఒకడేమో.. భూమి పలకలాగా ఉంటుందని.. ఇంకొకడు కోడి గుడ్డులాగా ఉంటుందని వాదించరట. చివరకు భూమి గుండ్రంగా ఉందని తేలింది. అందుకే ఇప్పుడు మనం భూమి ప్రతిరూపాన్ని గ్లోబుల్లో చూస్తున్నాం. సరే ఇక అంబేద్కరిస్టుగా పేరుండి మాల మహానాడులో కీలకంగా పని చేసి రాజకీయ నాయకుడిగా మారిన జూపూడీ ప్రభాకర్​రావు వద్దకు వద్దాం. వైఎస్​ రాజశేఖర్​రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్సీ పదవిలో కూర్చున్నారు. వైఎస్​ మరణం తరువాత జగన్​ ఆధ్వర్యంలోని వైఎస్సార్​ కాంగ్రెస్​లో కీలక పాత్ర పోషించారు.

రాష్ట్ర విభజన జరగడం, ఎన్నికల్లో చంద్రబాబు గెలవడంతో.. జూపూడీ తన రూటు మార్చుకున్నారు. 2014 ఆగస్టు 10న టీడీపీలో చేరిపోయారు. ఆ తరువాత ఏపీ ఎస్సీ ఫైనాన్స్​ కార్పోరేషన్​ చైర్మన్​గా కొనసాగారు. ఈ సమయంలో వైఎస్సార్​ కాంగ్రెస్​, ఆ పార్టీ అధినేత వైఎస్​ జగన్​పై విమర్శల మీద విమర్శలు గుప్పించారు. 2019 ఎన్నికలు ముగిశాయి. చంద్రబాబు ఓడిపోయారు. ఇప్పుడు జూపూడీకి జ్ఞానోదయమైంది. 2019 అక్టోబర్​ 8న వైఎస్సార్​ కాంగ్రెస్​లో చేరారు. ముఖ్యమంత్రి జగన్​ చేతుల మీదుగా కండువా కప్పుకున్నారు.

జూపూడీ ఇక్కడో మాట అనేశారు.. ఏంటంటే.. ఆనాడు గొర్రెల్లా టీడీపీలో చేరామన్నారు. కరెక్టే అధికారమనే.. పచ్చదనం టీడీపీలో కన్పించింది చేరారు. ఇప్పుడు అధికారమనే పచ్చగడ్డి వెస్సార్​ కాంగ్రెస్​లో కన్పించినందున ఇక్కడ చేరారు. రేపు అధికారమనే పచ్చగడ్డి ఎక్కడ కన్పిస్తే అక్కడికే. అందుకే అంటారు. పొద్దస్తమానం ఎటూ తిరిగినా.. చివరకు రాత్రికి చేరేదీ గూడుకే. కానీ రాజకీయ నాయకులకు ఒక్కటే గూడు ఉండదుగా.? అందుకే ఏదో ఒక గూడును వెదుక్కుంటారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here