Home breaking news అందరూ వెంకన్న వద్దకే వెళ్తే.. మరి యాదాద్రి నర్సన్న ఏం కానూ

అందరూ వెంకన్న వద్దకే వెళ్తే.. మరి యాదాద్రి నర్సన్న ఏం కానూ

389
0

–వికాస్​ రుషి

వైకుంఠ ఏకాదశి.. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని కాబోయే ముఖ్యమంత్రి సహా పెద్ద పెద్ద తలకాయలన్నీ.. తిరుపతిలో కన్పించాయి. కానీ ఆ స్థాయి తలకాయ ఒక్కటి కూడా యాదగిరిగుట్టలో కన్పించలేదు. 2015 సంవత్సరం.. ముఖ్యమంత్రి కేసీఆర్​కు హఠాత్తుగా రాజధానికి కూతవేటు దూరంలోని యాదగిరిగుట్ట గుర్తుకొచ్చింది. వెంటనే.. యాదాద్రి అని నామకరణం చేసేశారు. ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా యాదాద్రిని నిర్మిస్తానని శపథం చేసేశారు. దానికి తగ్గట్టుగా రూ. 2 వేల కోట్లు మంజూరు. ఏడాదిలో పనులు పూర్తి అన్నాడు. నాలుగేళ్లు గడిచింది. ముఖ్యమంత్రి హోదాలో 13 సార్లు కేసీఆర్​ యాదాద్రికి వచ్చారు. అయినా పూర్తి కాలేదు.  ఎంతలేదన్నా.. ఇంకో ఏడాది టైం పడ్తరని చెబుతున్నారు. ఇప్పటివరకూ తొందరగా తొందరగా అంటూ మాట్లాడిన కేసీఆర్​.. ఎంతటైమన్నా… తీసుకోండి. కానీ మంచిగ చేయాలే అంటూ చెప్పేసిండు. అంటే ఏడాదిలోనే పూర్తయ్యే ముచ్చట కూడా నమ్మకం లేదు. ఇప్పుడు అసలు ముచ్చటకు వద్దాం.

వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున దేవాలయాలను భక్తులు ఎక్కువగా వెళ్తారు. ఆ రోజు దర్శనం చేసుకుంటే ఎక్కువ పుణ్యం దక్కుతుంది. ఇంకా  కోరికలు తీరుతయని భక్తులకు నమ్మకం. భక్తులంటే నాబోటి  నీబోటోడే కాదు. ఇంకా పెద్దపెద్దోళ్లు కూడా ఉంటరుగా. వాళ్లకు కోరికటు ఉంటాయి. వాటిని తీర్చాలని కోరుకోవడానికి దేవుడి వద్దకు వెళ్తారు కాబట్టి.. అదే కోవలోని ముఖ్యమంత్రి కేసీఆర్​ కుమారుడు కేటీఆర్​ అదే ఐటీ శాఖ మంత్రి కూడా దేవుడి వద్దకు వెళ్లాడు. కేసీఆర్​ వంటి తెలంగాణ ఉద్యమకారుడు.. యాదాద్రికి 13 సార్లు వచ్చిన భక్తుడి కుమారుడు.. కాబోయే సీఎంగా ప్రచారమవుతున్న కేటీఆర్​ కూడా గుడికి వెళ్లాడు. ఈ ముచ్చట వింటే ఎవరైనా ఏమనుకుంటారు. అబ్బో కేటీఆర్​ కూడా యాదాద్రికి వచ్చారని అనుకుంటారు కదా. ఇక్కడే మనం కోనేరులో కాళ్లేసినట్టు. ఆయన వెళ్లింది.. తిరుపతిలోని వెంకన్న గుడికి. యాదాద్రిలోని నర్సన్న గుడికి కాదు.

సీఎం అవుతాడని ప్రచారం అవుతున్న సమయంలో అందునా వైకుంఠ ఏకాదశి రోజున వెంకన్న కాడికి ఎందుకెళ్తాడు. మనసులో ఉన్న కోరిక తీర్చమనే కదా. ఆయన మనసులో ఉన్న కోరిక ఏమై ఉంటది.సహజంగా మన మంత్రి శ్రీనివాస్​గౌడ్​ మనుసులో ఉన్న కోరికే ఉంటదిగా. సరే అయన కోరిక ఏమన్నా కానీ, తన వద్దకు రాకుండా తిరుపతిలో ఉన్న వెంకన్న వద్దకు పోయిండని యాదాద్రిలోని
నర్సన్న ఫీల్​ కాడా. అయితడు కచ్చితంగా అయితడు. ముఖ్యమంత్రి కొడుకు. కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారమున్న వ్యక్తి.. తనను కాదని తిరుపతికి వెళ్తే నొచ్చుకోడా. వెంకన్న.. నర్సన్న ఇద్దరు ఒకటే కానీ. ఎంతైనా మనసులో బాధపడుతరు కదా. ప్రపంచంలోనే గొప్ప పుణ్యక్షేత్రం చేస్తనని చెప్పిన తర్వాత గిదేందని అనుకుంటుండొచ్చు. సరే పెద్ద పెద్ద తలకాయలు అనుకున్నం కదా. అందులో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, మంత్రి హరీశ్​రావు, శ్రీనివాసగౌడ్​ ఇంక చానా మంది వెంకన్న కాడికి పోయిండ్రు వచ్చిండ్రు. ఇది కథ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here