Home breaking news అంతా అయిపోయింది.. విలీనం ముగిసింది

అంతా అయిపోయింది.. విలీనం ముగిసింది

91
0
  • వికాస్ రుషి

అనుకున్న‌ట్టే అయ్యింది. ఇక కాంగ్రెస్ అనే పార్టీ శాస‌న‌స‌భా ప‌క్షం టీఆర్ఎస్‌లో విలీనం ముగిసింది. మేమందరం టీఆర్ఎస్‌లో చేరిపోతాం.. విలీనం చేయాల‌ని కాంగ్రెస్ త‌రుపున గెలిచిన ఎమ్మెల్యేలంద‌రూ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంత‌కాల‌తో కూడిన ఒక విన‌తిప‌త్రాన్ని కూడా అందించారు. తాము టీఆర్ఎస్‌లో చేర‌డాన్ని ప్ర‌జలు కూడా ఆమోదించార‌ని వారు స్పీక‌ర్‌కు చెప్పేశారు. అంతే విలీనం ముగిసిపోయింది. విలీనం జ‌రిగిన‌ట్టుగా గెజిట్ కూడా జారీ అయ్యింది.గ‌తేడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌రుపున 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అప్ప‌టి నుంచి వారానికో ఎమ్మెల్యే చొప్పున‌..అన్న‌ట్టుగా టీఆర్ఎస్‌లో చేర‌డానికి క్యూ క‌ట్టారు. ఇలా వీరి సంఖ్య మొన్న‌టి వ‌ర‌కూ 11 మందికి చేరింది. వీరంద‌రు పోతే నేనెందుకుంటా అనుకున్నాడేమో ఫైల‌ట్ రోహిత్ రెడ్డి అనే మాజీ టీఆర్ఎస్ ప్ర‌స్తుత కాంగ్రెస్.. కాబోయే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా ఇదే క్యూలో చేరారు. టీఆర్ఎస్‌లో చేర‌డానికి లైనులోకి వ‌చ్చిన వారంద‌రితో యువ‌రాజు అదే కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఇవ్వాళ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మీటింగ్ పెట్టారు. ఆ త‌రువాత భోజ‌న తాంబూలాలు ముగిసిన త‌రువాత నేరుగా.. స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి మేమంద‌రం టీఆర్ఎస్‌లో చేరుతామంటూ విన‌తిప‌త్రం అందించారు. అంతే విలీనం ముగిసిపోయింది. విలీనం జ‌రిగిన‌ట్టుగా గెజిట్ కూడా జారీ అయ్యింది. 12 మంది పోగా 7 గురు మిగిలారు. వీరిలో ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు కాబ‌ట్టి.. చివ‌ర‌కు ఆరుగురు మిగిలారు. ఇక వీరిలో ఎంద‌రుంటారో ఎంద‌రు టీఆర్ఎస్‌లో చేరుతారో చెప్ప‌డం కూడా క‌ష్ట‌మే.

స్పీక‌ర్‌ను క‌లిసింది వీళ్లే

స్పీకర్‌ను కలిసిన ఎమ్మెల్యేల్లో సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆత్రం సక్కు, హరిప్రియా, జాజుల సురేందర్‌, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, సుధీర్‌ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, కందాల ఉపేందర్‌ రెడ్డి, చిరుమర్తి లింగయ్య ఉన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో పని చేయడానికి 12 మంది ఎమ్మెల్యేల‌ము సిద్ధంగా ఉన్నామని గండ్ర తెలిపారు. ప్రజలు కూడా త‌మ నిర్ణయాన్నిఆమోదించారని ఆయన వెల్ల‌డించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here